18 May, 2026 | 5:37 PM

రైస్‌మిల్లులో తప్పుడు లెక్కలు

12-12-2024 02:39 AM

* విజిలెన్స్ తనిఖీల్లో గుర్తింపు

* కేసు నమోదు చేసిన పోలీసులు

కామారెడ్డి, డిసెంబర్ 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని వజ్రఖండి గ్రామ సమీపంలో ఉన్న ఓ రైస్‌మిల్లు లో విజిలెన్స్ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. తప్పుడు లెక్క లను గుర్తించారు. రైస్‌మిల్లులో గత రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించారని, దీంతో ఏడు క్విం టాళ్ల ధాన్యం తేడా వచ్చినట్టు గుర్తించారు. కోట్లాది రూపాయల వ్యాపారాలు చేసినప్పటికీ అధికారికంగా తప్పుడు లెక్కలు చూపిం చారని, మిగతా వాటిని బ్లాక్‌మనీగా ఉపయోగించారని గుర్తించారు. దీంతో జుక్కల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై భువనేశ్వర్ కేసు నమోదు చేశారు.