20 April, 2026 | 6:06 PM

పట్టణ అభివృద్ధికి కృషి

20-04-2026 04:35 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని అన్ని వార్డులో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించినట్లు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ మున్సిపల్ చైర్ వైస్ చైర్మన్ తో కలిసి శ్రీనగర్ కాలనీలో (వార్డు నెంబర్ 13) రూ. 5 లక్షల ఎంపీలాడ్స్ నిధుల ద్వారా  కామన్ కమ్యూనిటీ షెడ్ పనులను ప్రారంభించారు.

మాట్లాడుతూ... ఈ స్థలం కాలనీవాసులు సంఘ సమావేశాలు, చర్చలు నిర్వహించడానికి, చిన్న చిన్న శుభాకార్యాలు, ఉపాధి శిక్షణ నిర్వహణలాంటి వాటికి ఉపయోగ పడుతుందని, కాలానివాసులు ఈ షెడ్డును సద్వినియోగ పర్చుకుంటూ పరిశుభ్రతతో కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ధర్మాజీ రమ్య, పట్టణ కౌన్సిలర్లు లక్కాకుల హరీష్, గంజి రాజు, ఎస్పీ రాజు, కత్తి నరేందర్, గోపు గోపి, రాఘవేంద్ర చారి, గుంజాల చైతన్య,శెనిగారపు నరేష్,పెండం శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.