calender_icon.png 1 October, 2025 | 11:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

01-10-2025 11:00:43 AM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని వివిధ కాలనీలో మహిళలు ఆనందోత్సవాలతో, ఉత్సాహంగా నిర్వహించుకుంటున్న బతుకమ్మ సంబరాలలో భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి(MLA Anil Kumar Reddy ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు ఎంతో పవిత్రంగా తొమ్మిది రోజులపాటు బతుకమ్మ సంబరాలను నిర్వహించుకుంటారని 9వ రోజున సద్దుల బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా బతుకమ్మ ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు