01-10-2025 10:54:09 AM
ఇడుక్కి: కేరళ రాష్ట్రం ఇడుక్కిలోని కట్టప్పనలో ఒక హోటల్ వ్యర్థాల ట్యాంక్‌లో(Hotel Septic Tank) చిక్కుకుని ముగ్గురు కార్మికులు మరణించారని పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మృతులను తమిళనాడులోని కుంబంకు చెందిన జయరామన్, గూడలూరుకు చెందిన సుందర పాండియన్, మైఖేల్‌గా గుర్తించారు. అగ్నిమాపక దళం ప్రయత్నించినప్పటికీ, రెస్క్యూ సిబ్బంది మ్యాన్‌హోల్‌లోకి ప్రవేశించలేకపోయారు. ఆ ప్రాంతాన్ని క్లియర్ చేయడానికి మట్టిని తొలగించాల్సి వచ్చింది. గంటన్నర పాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్(Rescue operation) తర్వాత, కార్మికులను ఆసుపత్రికి తరలించారు. కానీ వారిని రక్షించలేకపోయారు. మృతదేహాలను కట్టప్పన తాలూక్ ఆసుపత్రిలో ఉంచారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.