calender_icon.png 1 October, 2025 | 12:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాముకాటుతో కోబ్రా బెటాలియన్ జవాన్ మృతి

01-10-2025 09:57:07 AM

చైబాసా: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో జరిగిన నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో కోబ్రా బెటాలియన్‌కు చెందిన ఒక జవాన్(Cobra Battalion jawan) పాముకాటుతో(snakebite) మరణించాడని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. బాధితుడిని 209 కోబ్రా బెటాలియన్‌కు చెందిన సందీప్ కుమార్‌గా గుర్తించారు. చోటానాగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నూర్ధా అడవిలో నిషేధిత వామపక్ష తీవ్రవాద గ్రూపుపై కుమార్ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉండగా ఈ సంఘటన జరిగినట్లు ప్రకటనలో తెలిపారు. అతన్ని ఆసుపత్రికి తరలించారు కానీ చికిత్స పొందుతూ మరణించారని తెలిపింది.