calender_icon.png 9 November, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనభోజనాలతో ఐక్యత, స్నేహభావం

09-11-2025 06:26:35 PM

ఆర్యవైశ్య వనభోజన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని..

లక్ష్మీదేవిపల్లి/కొత్తగూడెం (విజయక్రాంతి): కార్తీక మాస వనభోజనాలతో ఐక్యత, స్నేహభావం పెంపొందుతుందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచలోని లక్ష్మి గార్డెన్స్, లక్ష్మిదేవిపల్లి మండలం యల్లావుల పాపారావు తోటలో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య వనసమారాధన సామూహిక వనభోజనాల కార్యక్రమాలకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా హాజరయ్యారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతు నియోజకవర్గ వ్యాప్తంగా కార్తీక మాస వనభోజన మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్తీక మాస వనభోజన మహోత్సవాల ద్వారా ఆధ్యాత్మిక భావాలు, సోదర భావాలు పెంపొందుతాయని, ఒకేచోట చేరి సామూహిక భోజనాలు చేయడం అభినందనీయమన్నారు. సామాజిక సేవా రంగాల్లో ఆర్యవైశ్యులు అగ్రస్థానంలో నిలిచి అందరికి ఆదర్శంగా ఉండాలన్నారు. పూర్వం నుంచి సమాజ శ్రేయస్సు కోసం వనభోజన మహోత్సవాలు ఆచారంగా నిర్వహిస్తున్నారని, ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్న ఆర్యవైశ్య సంఘ సభ్యులను అభినందించి ప్రజలందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలిపారు.