calender_icon.png 9 November, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత పోరాటాలకు సిద్ధం కావాలి

09-11-2025 06:23:49 PM

ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెపూరి కొండలు..

చిలుకూరు: ఉద్యోగ ఉపాధి హక్కుల కోసం యువత పోరాటాలకు సిద్ధం కావాలని జిల్లా ప్రధాన కార్యదర్శి చేపూరి కొండలు పిలుపునిచ్చారు. ఆదివారం చిలుకూరు మండల 11వ మహాసభ డిఎన్ భవన్లో సిపిఐ కార్యాలయంలో జరిగింది. మహాసభ ప్రారంభానికి ముందు ఏఐవైఎఫ్ జెండాను జిల్లా కార్యదర్శి చేపూరి కొండలు ఆవిష్కరించి అనంతరం, చిలుకూరు మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఏఐవైఎఫ్, మండల అధ్యక్షులుగా, అనంతుల రాము, ప్రధాన కార్యదర్శిగా కడారు మధు, వర్కింగ్ ప్రెసిడెంట్ వజ్రపు శ్రవణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా ముష్కుల శ్రీనివాస్ రెడ్డి, పిల్లుట్ల జగదీష్, నెమ్మాది గురుస్వామి, సహాయ కార్యదర్శులుగా, మీసాల సాయి, పిల్లుట్ల భాస్కర్, కాంపాటి రంజిత్, పాశం గోపి, కోశాధికారి కీసర గాంధీ, కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి, మండవ వెంకటేశ్వర్లు, షేక్ సాయి బల్లి, కాంపాటి వెంకటయ్య, కొండ కోటయ్య, పాల్గొన్నారు.