calender_icon.png 9 November, 2025 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టసభలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి

09-11-2025 06:34:25 PM

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ కోతి రాములు గౌడ్..

తుంగతుర్తి (విజయక్రాంతి): స్థానిక సంస్థలతో పాటు, విద్యా, ఉద్యోగ, అసెంబ్లీ పార్లమెంట్ చట్టసభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ కోతి రాములు గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 60 శాతం కలదు ప్రభుత్వ గణాంకాల ప్రకారం బీసీ జనాభా 52 శాతంగా తేల్చారు విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో ప్రభుత్వం ఇచ్చిన 42% రిజర్వేషన్ అమలు చేసి, స్థానిక సంస్థల యందు సర్పంచు నుండి జిల్లా ప్రజా పరిషత్ వరకు రిజర్వేషన్లు ఏర్పాటు చేసి ప్రజల అవసరాలు తీర్చినట్లుగా, ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేయాలని కోరారు.

బీసీలకు రాజ్యాంగంలో 9 షెడ్యూల్లో చేర్చి, అసెంబ్లీ పార్లమెంటులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి ఉత్తర భారతదేశంలో బీసీలు చైతన్యవంతులై ముఖ్యమంత్రి స్థానాలను పొందుతున్నారు. కాని తెలంగాణలో మాత్రం ఆ విధంగా జరుగుట లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో బీసీ ప్రాతినిధ్యం పెంచి, రాజకీయాలకతీతంగా అన్ని బీసీ సంఘాలు ఏకమై దక్షిణ భారత రిజర్వేషన్లు, చట్టసభలలో సాధించే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు.