సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సదాశివపేట, మార్చి 15 : సదాశివపేట మండలంలోని ముబారక్పూర్- ఏ, వెల్టూర్, కొనాపూర్, నాగసన్పల్లి గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధికి ఈ రోడ్లు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.
ముబారక్పూర్‌ఏ రూ.7 లక్షలు, వెల్టూర్, రూ.8 లక్షలు, కొనాపూర్ రూ.8 లక్షలు,నాగసన్పల్లి రూ.6 లక్షల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. కొనాపూర్ గ్రామానికి చెందిన వార్డ్ సభ్యులు ఆశం, ఆదిల్ గ్రామ సర్పంచ్ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో చింత ప్రభాకర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకొని బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెద్దగోల్ల ఆంజనేయులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడిల సుధీర్ రెడ్డి, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, ఏఈ కోటేశ్వరరావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.




