16 March, 2026 | 6:15 PM

అనుమతులు లేని ఇసుక టిప్పర్ పట్టివేత

16-03-2026 12:00 AM

పాపన్నపేట,మార్చి15: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ను పట్టుకొని ఠాణాకు తరలించినట్లు ఎస్త్స్ర శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మెదక్ వైపు నుంచి బొడ్మట్ పల్లి వైపు ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్ ఇసుక రవాణా చే స్తుందని నమ్మదగిన సమాచారం రావడం తో ఆదివారం ఉదయం సమయంలో సిబ్బందితో కలిసి వెళ్లి పాపన్నపేట గ్రామ శి వారులో ఒక టిప్పర్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్త్స్ర పేర్కొన్నారు. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.