3 June, 2026 | 5:01 PM

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

03-06-2026 04:04 PM

బోథ్,(విజయక్రాంతి): నేరడిగొండ మండలంలోని తేజపూర్ గ్రామంలో మృతి చెందిన ఇరువురు కుటుంబాలను అదేవిధంగా సోనాల మండలంలోని సంపత్ నాయక్ తాండ గ్రామానికి చెందిన రాథోడ్ తుకారం కుటుంబాన్ని బుధవారం ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి మరణాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సర్పంచుల సంఘం బోత్ మండల అధ్యక్షులు ఓరుగంటి స్వామి మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి సకారం సుధీర్ రెడ్డి రామ్ కిషన్ బాబు లాల్ రవీందర్ యాదవ్ ఉప సర్పంచ్ శ్రీకాంత్ తో పాటు ఈశ్వర్ అసిఫ్ రమణ ప్రదీప్ చిన్నయ్య తదితరులు ఉన్నారు