15 April, 2026 | 1:16 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

కాకా ఫ్యామిలే కాంగ్రెస్ కు పట్టాదారు..

06-05-2025 04:23 PM

తాండూరు సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ సంచలన వ్యాఖ్యలు..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణ సన్నాహక సమావేశాలు విస్తృతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం  నియోజకవర్గంలోని తాండూర్ మండల కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ లో బెల్లంపల్లి ఎమ్మెల్యే  గడ్డం వినోద్ వెంకటస్వామి(MLA Gaddam Vinod Venkataswamy) అధ్యక్షతన జై బాబు, జై భీమ్, జై సమ్మిదాన్ రాజ్యాంగ పరిరక్షణ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ & గోవర్ ఫెడరేషన్ చైర్మన్ టీ పీ సీసీ పరిశీలకులు జంగా రాఘవ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కాకా ఫ్యామిలీ అంటే కాంగ్రెస్ కి పట్టేదారులని వ్యాఖ్యానించారు. గడ్డం ఫ్యామిలీ అంటే మరకలేని కుటుంబమని పేర్కొన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ ఏ సమయంలో అయినా మా ఇంటి తలుపు తట్టచ్చని ప్రజలకు సందేశం ఇచ్చారు. దేశ ప్రజలందరూ భారత రాజ్యాంగ పరిరక్షణలో భాగ్యస్వామ్యం అవ్వాలి రాజ్యాంగం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందనీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాన్నారు. అర్హులైన నాయకులకు కచ్చితంగా పదవులు వస్తాయనీ హామీ ఇచ్చారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి  ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు రజిత, టీపీసీసీ సభ్యులు చిలుముల శంకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.