28 June, 2026 | 2:05 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

చిత్తారమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యే జీఎంఆర్

09-05-2026 12:00 AM

జిన్నారం, మే 8 : అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జిన్నారం మున్సిపల్ పరిధిలోని కొర్లకుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ చిత్తారమ్మ దేవాలయంలో శుక్రవారం నిర్వహించిన అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించి నూతన దేవాలయాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు , సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, ప్రకాశ్ చారి, నరసింహ, బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.