బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి
18-10-2025 05:42 PM
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చేపట్టిన రాష్ట్ర బంద్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు తెలిపింది. అసిఫాబాద్ బస్టాండ్‌లో అంబేద్కర్ విగ్రహానికి సీపీఐ నాయకులు పూలమాల వేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి బద్రి సాయికుమార్ మాట్లాడుతూ బీసీల హక్కుల సాధన కోసం కేంద్రం పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఆపేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కులగణన సర్వే ఆధారంగా రాష్ట్రం పంపిన బిల్లును కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరి చిరంజీవి, తాళ్లపెళ్లి దివాకర్, కొదురుపాక మహేష్, బావునే వికాస్ తదితరులు పాల్గొన్నారు.




