13 March, 2026 | 6:32 PM

ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి

02-11-2024 12:14 PM

మంత్రి కొండా సురేఖకు హరీష్ బాబు ఫిర్యాదు 

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయ క్రాంతి): ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు శనివారం హైదరాబాదులో ఆటవిశాఖ మంత్రి కొండా సురేఖ ను  కోరారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు కాస్టికాలకు అంతేలేకుండా పోతుందని, దీంతోపాటు అడ్డగోలు అవినీతి అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సిర్పూర్ రేంజ్ అధికారి, రెబ్బెన సెక్షన్ ఆఫీసర్ ఏడుగురు రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేశారని వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సదరు అధికారులపై చర్యలు తీసుకోకుంటే ఈ నెల 4వ తేదీ నుండి రైతులతో కలిసి నిరాహార దీక్ష చేస్తానని స్పష్టం చేశారు.