calender_icon.png 13 October, 2025 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

13-10-2025 12:00:00 AM

ములకలపల్లి/ అన్నపురెడ్డిపల్లి, అక్టోబర్ 11 (విజయ క్రాంతి): అశ్వరావుపేట నియోజకవర్గం లోని అన్నపరెడ్డిపల్లి మండలం ఎర్రగుంట హైస్కూల్ లో తొలిఅడుగు ఫౌండేషన్ , ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణ ప్రారంభించారు.

గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఈ క్యాంప్ కీలక పాత్ర పోషిస్తుందని, ఇక్కడ ప్రాథమిక వైద్య పరీక్షలు, నిపుణుల సలహాలు, ఆరోగ్య నిర్వహణ కార్యక్రమాల ద్వారా గ్రామస్తులు సులభంగా సేవలు పొందవచ్చని ఆయన తెలిపారు. శిబిరానికి హాజరైన రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సీతారాంపురంలో మసీదు ప్రారంభం..

ములకలపల్లి మండలంలోని సీతారాంపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన మసీద్ ను ఆదివారం ఎమ్మెల్యే ఆదినారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, కమిటీ నాయకులు పాల్గొన్నారు.