calender_icon.png 13 October, 2025 | 1:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టుబడుతున్నా భయం లేదు..!

13-10-2025 12:00:00 AM

కానిస్టేబుల్ ఏసీబీకి ఫిర్యాదు చేసిన బాధితుడు, పోన్‌పే స్క్రీన్‌షాట్ వైరల్

మణుగూరు, అక్టోబర్ 12 (విజయ క్రాంతి) : మణుగూరు పోలీస్ శాఖ లో  పనిచేస్తున్న కొందరు  అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)ని అస్సలు లెక్కచేయడంలేదు. ఐ డోంట్ కేర్ అంటూ రెచ్చిపోతున్నారు. పోలీస్ స్టేషన్ ఫై ఏసీబీ దాడులు జరుగుతున్నా, కొందరు అధికారులు  రెడ్ హ్యాండెడ్గా చిక్కుతున్నా పోలీస్ సిబ్బందిలో  కించిత్తు భయం కని పించడంలేదు.

కొందరు దొరికిపోయినా మార్పు రావడంలేదు. ఏసీబీ  దాడుల ఉదంతం మరుకముందే, మరో బాధితుడు న్యాయం కోసం  ఏసీబీ ని ఆశ్రయించాడు. మణుగూరు పోలీస్ స్టేషన్లో  పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్  తన వద్ద నుండి ఆగస్టు  29న మూడు వేలు పోన్ పే చేయించుకున్నారని, సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. రూ. 3వేల స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బాధితుడు ఏసీబీ కి  పిర్యాదు చేసినట్లుగా సమాచారం అందుతుంది.. చట్టానికి రక్షణగా నిలవాల్సిన రక్షక భటులు ఇలా చేయడంతో సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇదే పోలీస్ స్టేషన్లో గతంలో ఇద్దరు పోలీసు అధికారులు ఏసీబీకి ట్రాపై కటకటాలు లెక్కిస్తు న్న విషయం  విషయం తెలిసిందే. ఉన్నత అధికారులు ఏం చేస్తున్నా రన్నది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ స్పందిస్తే తప్ప మణుగూరు పోలీస్ స్టేషన్ లో అవినీతి కి ప్రళక్షణ జరుగుతుందని  ప్రజలు కోరుతున్నారు.