వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
22-04-2026 12:58 AM
ఎర్రవల్లి తేదీ ఏప్రిల్ 21: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం పరిధిలోని కొండేరు, తిమ్మాపూర్,జింకలపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్లు కొనుగోలు కేంద్రాన్ని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో రైతు సోదరులు పాల్గొన్నారు.






