22 March, 2026 | 1:09 AM

మొరంచ వాగును పరిశీలించిన ఎమ్మెల్యే

22-07-2024 12:17 AM

జయశంకర్ భూపాలపల్లి, జూలై 21(విజయక్రాంతి): నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. ఆదివారం మొరంచపల్లి వాగు ఉధృతిని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని, అధికారులు, ప్రజాప్రతిని ధులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న వాగు పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. మొరంచవాగు మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తోందని, వరద ప్రభావం ఇలాగే కొనసాగితే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ఆయన వెంట జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మంగీలాల్, ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ ప్రసాద్, తహసీల్దార్ ఉన్నారు.