మరో మూడు రోజులు వర్షాలే
22-07-2024 12:15 AM
కొనసాగుతున్న అల్పపీడనం
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజా మాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరపులతో వర్షాలు పడే అవకాశం ఉం దని వాతావరణ కేంద్రం తెలిపింది.




