calender_icon.png 21 July, 2025 | 3:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

21-07-2025 01:06:39 AM

నారాయణఖేడ్, జూలై 20:  నారాయణఖేడ్ నియోజకవర్గంలోని చల్లగిద్ధ తండాలో నిర్మిస్తు న్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవరెడ్డి ఆదివారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం కాలేశ్వరం పేరుతో తెలంగాణ రాష్ట్ర ఖజానాను పూర్తిగా ఖాళీ చేసిందని ఆరోపించారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాలన గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని నిజాంపేట్ మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. నారాయణఖేడ్ పట్టణంలోని మంగల్ పేటలో ఆరెల్లి మైసమ్మ బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవుల నాయక్, రమేశ్ చౌహన్ తదితరులు పాల్గొన్నారు.