21-07-2025 02:28:31 PM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మన దార్శనిక నాయకుడు, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు మంచి ఆరోగ్యం, ఆనందంగా ఉండాలని భగవంతుడిని కోరుతున్నట్లు తెలిపారు. మరిన్ని సంవత్సరాలు దేశ ప్రజలకు సేవ చేయాలని కోరారు.
కర్ణాటకకు చెందిన మల్లిఖార్జున్ ఖర్గే 27 యేళ్ళ వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. 1972లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 10 సార్లు శాసనసభకు ఎన్నికై రికార్డు సృష్టించిన ఆయన... 2009 నుంచి 2019 వరకూ లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. AICC అధ్యక్ష పదవికి పోటీ చేసే ముందు ఆయన రాజ్యసభలో విపక్షనేతగా ఉన్నారు.