2 September, 2026 | 7:04 PM

నర్మెట్ట సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పెండ్యాల దేవేందర్ బాధ్యతల స్వీకరణ

02-09-2026 | 06:32pm

జనగామ, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): బుధవారం రోజున నర్మెట్ట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్(Narmetta Circle Inspector of Police) గా పెండ్యాల దేవేందర్(Devender) నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడానికి కృషి చేస్తానని తెలిపారు. నేరాల నియంత్రణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఎటువంటి సమస్య ఉన్నా నేరుగా సంప్రదించవచ్చని సూచించారు. సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు