11 May, 2026 | 1:31 AM

విద్యా వారోత్సవ కార్యక్రమాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

11-05-2026 12:24 AM

అలంపూర్ మే 10: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈనెల 11 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న (ఎడ్యుకేషన్ వీక్) విద్యా వారోత్సవాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా అలంపూర్ నియోజకవర్గంలో విద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే విజయుడిని నియోజకవర్గ మండల విద్యాశాఖ అధికారులు అధికారకంగా ఆహ్వానించారు.

ఈ మేరకు ఆదివారం కర్నూలులోని ఎమ్మెల్సీ నివాసంలో ఎమ్మెల్యే విజయుడును వారు మర్యాద పూర్వకంగా కలసి ఆహ్వాన పత్రికను అందించారు.ఈ సందర్భంగా ఎంఈఓ లు మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడంతోపాటు విద్యార్థుల నైపుణ్యాలను వెలికి తీయడం మరియు విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు రూపొందించినట్లు మండల విద్యాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు అశోక్ కుమార్, భగీరథ రెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు