28 February, 2026 | 2:16 PM

కేరళ తరహాలో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జారే

28-02-2026 12:50 AM

తెలంగాణ రాష్ట్రంలోనే మొదటగా ప్రారంభించిన ఆధునిక అంగన్‌వాడీ కేంద్రం

దమ్మపేట, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శుక్రవారం దమ్మపేట మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

మొదటగా మండలంలో మారుమూల అటవీ ప్రాంతం ఆదివాసిలు నివసించే పూసుకుంట గ్రామంలో స్వయం సహాయక మహిళల కోసం కమ్యూనిటీ భవనం నిర్మాణానికి, ప్రభుత్వ పాఠశాల (జీపిఎస్) కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తదనంతరం ఆర్లపెంట గ్రామంలో స్వయం సహాయక సంఘాల కమ్యూనిటీ భవనం, టీడబ్ల్యూపీఎస్ పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తదనంతరం పట్వారిగూడెం పంచాయతీ పరిధిలోని సుధాపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు.

రాచూరుపల్లి పంచా యతీ పరిధిలోని పాత లచ్చాపురం గ్రామం లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. జమేదార్ బంజర్ పంచాయతీ గుర్వాయిగూడెం గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించి, దమ్మపేట మండల కేంద్రం అర్బన్ కాలనీలో పలు సిమెంట్ రోడ్లు ప్రారంభించారు. కేరళ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో మొదటగా నిర్మించిన అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా నూతన అంగన్వాడీ కేంద్రం లో చిన్నారులతో పాటు కూర్చొని వారితో ముచ్చటించి, చిన్నారులకు మెరుగైన ప్రీ-స్కూల్ విద్య, గర్భిణీలకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ టీచర్లకు తెలియజేశారు.  అశ్వారావుపేట నియోజకవర్గంలో గల ప్రతి పాఠశాలకు మంచినీరు, వసతి, ప్రహరీ, టాయిలెట్లు కల్పించే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తున్నామని అన్నారు. అంగన్వాడీ టీచర్లపలువురు పలు సమస్యలపై విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించి త్వరలో చేస్తాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.డి.ఓ రవీందర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ సాయి కిషోర్ రెడ్డి, సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, రావు గంగాధరరావు, కక్కిరాల రమేష్ అత్తులూరి వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.