20 April, 2026 | 4:36 PM

బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త

20-04-2026 03:35 PM

బోథ్,(విజయక్రాంతి): సవేశ్వరుడు. 12వ శతాబ్దంలో గొప్ప సంఘసంస్కర్తగా పేరు పొందాలని ఆయన చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని బోత్ శాసనసభ్యులు జాదవ్ అనిల్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని కౌట(బి )గ్రామంలో లింగాయత్ సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వర జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని ప్రసంగించారు గత ప్రభుత్వ హయాంలో బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహించడంతోపాటు ట్యాంక్ బండ్ పైన విగ్రహం ఏర్పాటు చేశారన్నారు.

కుల వివక్షను పురుష స్త్రీల అసమానతలను రూపుమాపణంలో ఆయన కృషి ఎంతగానో ఉందన్నారు దేహమే దేవాలయం అన్న నినాదంతో సామాజిక సమానత్వము బోధించారని పేర్కొన్నారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఓరుగంటి స్వామి, వెండి సోమేశ్వర్ ఉపసర్పంచ్ రమణారెడ్డి నాయకులు రాంరెడ్డి సాగర్ రెడ్డి కొంకటి గంగాధర్ వార్డు సభ్యులు గడ్డల శంకర్ వివేకానంద యూత్ సభ్యులు పాల్గొన్నారు.