అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
20-04-2026 03:22 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో (వార్డు నెంబర్ 13) రూ.5 లక్షల ఎంపీలాడ్స్ నిధుల ద్వారా కామన్ కమ్యూనిటీ షెడ్ నిర్మాణానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, స్థానిక కౌన్సిలర్ ధర్మాజీ గారి రమ్య ఈశ్వర్, పట్టణ కౌన్సిలర్లు సాధం అరవింద్, గంజి రాజు, శ్రీరామోజీ నరేష్, పట్టణ బీజేపీ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, బీజేపీ నాయకులు మెడిసెమ్మ రాజు, ఒడ్నాల రాజుతో పాటు పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






