calender_icon.png 19 July, 2025 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

19-07-2025 12:40:34 AM

 సంస్థాన్ నారాయణపూర్,జూలై 18(విజయ క్రాంతి): నారాయణపురం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా  మాజీ మంత్రి,ప్రస్తుత సూర్యపేట శాసనసభ్యులు గుంతకండ్ల  జగదీశ్వర్ రెడ్డి  జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని మళ్లీ మంత్రిగా జగదీశ్వర్ రెడ్డిని చూడబోతున్నా మని అన్నారు.

ఉమ్మడి జిల్లా మంత్రిగా మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు జగదీశ్వర్ రెడ్డి అన్నారు.  ఈ కార్యక్రమంలో  మండల పార్టీ అధ్యక్షుడు నర్రి నరసింహ, సీనియర్ నాయకులు అందోజు శంకరాచారి, గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ బిక్షం, చిలువేరు భిక్షం, విద్యార్థి సంఘం నియోజకవర్గ అధ్యక్షులు నలపరాజు రమేష్, మాజీ సర్పంచులు మైల యాదవ రెడ్డి, కట్టెల బిక్షపతి, పాండురంగ నాయక్, ఏర్పుల అంజమ్మ, దోనూరు శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు ఈసం యాదయ్య, శివరాత్రి కవిత విద్యాసాగర్, మండల నాయకులు, బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు  పాల్గొన్నారు.

చండూరు చౌరస్తాలో..

 చండూరు, జులై 18 ( విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్ రెడ్డి జన్మదిన సందర్భంగా శుక్రవారం   బిఆర్‌ఎస్ మండల, మున్సిపాలిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్థానిక చౌరస్తాలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఆ పార్టీ చండూరు మండల, పట్టణ అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, కొత్తపాటి సతీష్ అధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ కోడి వెంకన్న,  మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దగోని వెంకన్న గౌడ్, జిల్లా నాయకులు ఎత్తపు మధుసూదన్ రావు, తేలు కుంట్ల చంద్రశేఖర్, తేలు కుంట్ల జానయ్య,యువజన అధ్యక్షులు ఉజ్జిని అనిల్ రావు, మాధగోని వెంకటేశం, నరేష్, చొప్పరి దశరథ, విరమల్ల స్వామి, బోడ శ్రీకాంత్, ఇరిగి రామన్న, గుండమల్ల శ్రీను, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.