19-07-2025 12:42:15 AM
రాష్ట్ర మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్, జూలై 18: జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి నిజాముద్దీన్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని రాష్ట్ర నీటిపారుదల శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజాముద్దీన్ సంతాప సభను నిర్వహించారు.
రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,మాజీ సీఎల్పీ నాయకులు కుందూరు జానారెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతితో కలిసి సంతాప సభలో పాల్గొని మాట్లాడారు...లింగగిరి గ్రామానికి చెందిన ఎండి నిజాముద్దీన్ మాజీ జెడ్పిటిసిగా కొన్ని దశాబ్దాల నుంచి హుజూర్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారని వారి సేవలను కొనియాడారు.పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారని,పార్టీ ఇచ్చిన ఆదేశాలను తప్పక పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్దే లక్ష్యంగా పనిచేశారన్నారు.
నిజాముద్దీన్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ వారి కుటుంబానికి ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్ రావు,తిప్పన విజయసింహరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దేశ్ ముఖ్ రాధిక అరుణ్ కుమార్,పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు,షేక్ సైదా, అజీజ్ పాషా,దొంగరి వెంకటేశ్వర్లు, ఈడుపుగంటి సుబ్బారావు, చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి,చక్కెర వీరారెడ్డి, మంజునాయక్, దొంతగాని శ్రీనివాస్,కోతి సంపత్ రెడ్డి,గూడెపు శ్రీనివాస్,భూక్యా గోపాల్,కాంగ్రెస్ నాయకులు,పాల్గొన్నారు.
దొడ్డ నారాయణరావు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఉత్తమ్
చిలుకూరు, జులై 18: సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు దొడ్డ నారాయణరావు మృతి చెందగా శుక్రవారం ఆయన కుటుంబాన్ని భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాడిన వ్యక్తి నారాయణరావు అన్నారు. ఆయన మరణం సిపిఐ పార్టీకి తీరని లోటన్నారు. లక్ష్మారెడ్డి, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవ ర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్,సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ బజ్జురి వెంకటరెడ్డి, కొండ కోటయ్య, మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, టిడిపి మండల అధ్యక్షులు సాతులూరు గురవయ్య, ఆయన కుమారులు, రమేష్, సురేష్, శ్రీధర్ ఉన్నారు.