లింగాలపల్లిలో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే జారె
దమ్మపేట, మార్చి 2 (విజయక్రాంతి): మండల పరిధిలోని లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆకస్మికంగా సందర్శించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పాఠశాలలో నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఏ తరగతి చదువుతున్నారు, భవిష్యత్తులో ఏమవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారో తెలుసుకున్నారు.
కొంతమందిని పాఠాలు చదివిస్తూ, మరికొంతమందిని ప్రశ్నలు అడిగి వారి శక్తిని పరిశీలించారు. పిల్లలు ధైర్యంగా సమాధానాలు చెప్పడం పట్ల ఎమ్మెల్యే సంతో షం వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో ఎమ్మెల్యే శ్రీమతి వరలక్ష్మి ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న సందర్భంలో కూడా ప్రత్యేకత ఏమాత్రం చూపకుండా సాధారణంగానే పాఠశాల పనితీరును పరిశీలించారు అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ బోధన విధానం, విద్యార్థుల హాజరు శాతం, పాఠశాలలో వసతులు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు.




