30 August, 2026 | 6:48 PM

Breaking News

సమాజ ప్రగతికి యువత తమ ప్రతిభను వినియోగించాలి   •   మాజీ ఎంపీపీ జగన్ మోహన్‌రావుకు పరామర్శ   •   అఖండ జ్యోతి కార్యక్రమంలో ఆలరించిన పల్లి గ్రామ భక్తులు   •   కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేందుకు జిల్లా అధ్యక్షుని కృషి   •   భగవద్గీత శ్లోక పఠన పోటీలకు విశేష స్పందన   •   ఎంఎస్‌పీ గణపురం మండల అధ్యక్షుడిగా నాగరాజు   •   నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ప్రభుత్వాలు   •   మాజీ సర్పంచ్ వెంకన్న కుటుంబానికి ఎమ్మెల్యే పోచారం ఆపన్నహస్తం   •   48గంటల రిలే నిరాహార దీక్ష పోస్టర్ ఆవిష్కరించిన గొండ్వాన సంక్షేమ పరిషత్   •   జగన్నాధపురంలో ‘గ్రోమోర్’ కేంద్రం ప్రారంభించిన సర్పంచ్ వినోద్   •  

మంచినీటి ఎద్దడికి తక్షణ పరిష్కారం

30-08-2026 05:45 PM

ప్రజాసమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జారే

దమ్మపేట, ఆగస్టు 30(విజయ క్రాంతి): మండల పరిధిలోని మొద్దులగూడెం ఎస్సీ కాలనీలో గత రెండు రోజులుగా తాగునీటి ఎద్దడితో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ తక్షణమే స్పందించారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఎమ్మెల్యే జారే కాలనీకి తక్షణమే కొత్త బోర్వెల్ ను మంజూరు చేయించి, బోర్ వేయించి నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు.

సమస్య చిన్నదైనా, పెద్దదైనా ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి,  వెంటనే పరిష్కరిస్తూ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు మొద్దులగూడెం ఎస్సీ కాలనీ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.