11 August, 2026 | 1:07 AM

గాయపడిన నేతకు ఎమ్మెల్యే కసిరెడ్డి పరామర్శ

11-08-2026 12:23 AM

అమనగల్లు, అగస్టు 10 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నాయకులు దారెడ్డి నర్సిరెడ్డిని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శుక్రవారం పరామర్శించారు.  అమనగల్ మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు దారెడ్డి నర్సిరెడ్డి ఇటీవల ప్రమాదానికి గురవడంతో ఆయనను చికిత్స నిమిత్తం వెల్దండలోని ఎన్‌ఎన్‌ఎం ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆసుపత్రికి చేరుకుని నర్సిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నర్సిరెడ్డి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు. పరామర్శ కార్యక్రమంలో జిల్లా నాయకులు యాచారం వెంకటేశ్వర్లు గౌడ్, పాలకూర్ల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.