11 August, 2026 | 2:53 AM

కార్మిక చట్టాలను రద్దు చేయాలి

11-08-2026 12:20 AM

మాజీ ఎమ్మెల్సీ సీతారాములు 

ఎల్బీనగర్ చౌరస్తాలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా 

ఎల్బీనగర్, ఆగస్టు 10: కేంద్ర ప్రభుత్వం తేనున్న కార్మిక చట్టాలను రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్సీ సీతారాములు డిమాండ్ చేశారు. క్విట్ ఇండియా స్ఫూర్తితో సోమవారం ఎల్బీనగర్ చౌరస్తాలో సీఐటీయూ, వ్యవసాయ, కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో  జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చంద్రమోహన్, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలు గు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, నాలుగు లేబర్ కోడ్లు అమలైతే 12 గంటల పని విధానం వస్తుందన్నారు.

ఉద్యోగులకు సా మాజిక భద్రత లేకుండా పోతుందని, సమ్మె చేసే హక్కులు కోల్పోతామని, ఎలాంటి నోటీసులు లేకుండానే కార్మికులను తొలగించే విధానం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా జీరో దిగుమతులతో భార త రైతాంగం దెబ్బతినే విధంగా అమెరికా ఆంక్షలతో మన వ్యవసాయ ఉత్పత్తులకు డి మాండ్ తగ్గే విధంగా నూతన చట్టాలను తీ సుకువస్తున్నారని, నూతన విద్యుత్ విధానము అమలు జరిగితే స్మార్ట్ మీటర్లు వస్తాయని విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగి ప్రజలపై భారాలు విపరీతంగా పెరుగుతాయని, జీరో బిల్లు రద్దు అవుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు డి.జగదీష్, ఎస్.రామ్మోహన్, ఎం.వీరయ్య, సహాయ కార్యదర్శులు దేవేందర్, ఆలేటి ఎల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ కృష్ణయ్య, శేఖర్ యాదవ్, నాయకులు చైతన్య, పార్వతి, స్వామి, వెంకటయ్య, స్వప్న, కవిత, లతీఫ్, పరశురాములు, నరహరి, రాములు, కేసరి నర్సిరెడ్డి, గోరింకల నర్సింహ, వెంకన్న, కృష్ణమూర్తి, విశ్వకర్మ  యాదగిరి చారి తదితరులు పాల్గొన్నారు.