11 August, 2026 | 3:47 AM

విధినిర్వహణలో అలసత్వం వహించిన మున్సిపల్ అధికారులు

11-08-2026 01:05 AM

తూప్రాన్, ఆగస్ట్ 10 (విజయ క్రాంతి) : తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ తూప్రాన్ పారిశుద్య నిర్వహణలో జాప్యం వహించడంతో ఎక్కడి చెత్త అక్కడే అన్న చందంగా మున్సిపల్ పట్టణంలోని మూడవ వార్డులో చోటుచేసుకుంది. గత నాలుగు రోజుల నుండి మున్సిపల్ మూడో వార్డులో గతంలో ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి పిచ్చి మొక్కలు విరిగి కరెంటు తీగలమీద పడిన నేపథ్యంలో విద్యుత్తు అధికారులు కరెంటు తీగలపై పడిన కొమ్మలను, పిచ్చి మొక్కలను తొలగించారు.

తొలగించిన పిచ్చి కొమ్మలు మూడవ వార్డు కాలనీలో రహదారికి చెత్త అడ్డంగా ఉండి పోవడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ కు సమాచారం చేరవేసిన పట్టించుకోకపోవడం జరిగింది. మహంకాళి జాతర ఉత్సవాల సందర్భంగా పలు కాలనీలను నుండి ప్రజలు ఉత్సాహంతో వస్తుండగా దారిలో అడ్డుగా నరికిన కొమ్మలు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.