calender_icon.png 20 January, 2026 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమనగల్లు నా సొంత గడ్డ.. ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం!

20-01-2026 12:28:05 AM

ఇప్పటికే రూ. 63 కోట్లతో అభివృద్ధి..

రాజకీయాలకు అతీతంగా ’ఇందిరమ్మ ఇళ్లు’

మహిళా సంఘాలకు రూ. 93.92 లక్షల వడ్డీ లేని రుణాల పంపిణీలో ఎమ్మెల్యే కసిరెడ్డి

ఆమనగల్లు, జనవరి 19 (విజయక్రాంతి): ‘నేను ఆమనగల్లు బిడ్డను.. ఈ గడ్డపైనే చదువుకుని పెరిగాను. ఈ ప్రాంత అభివృద్ధి నా బాధ్యత‘ అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఉద్ఘాటించారు. సోమవారం ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ లక్ష్మీ గార్డెన్ లో స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ. 93.92 లక్షల వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలను ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, కమిషనర్ శంకర్లతో కలిసి ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచే ఆమనగల్లు మున్సిపాలిటీపై ప్రత్యేక మమకారం చూపిస్తున్నానని, ఇప్పటివరకు రూ. 63 కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టానని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులతో ఈ మున్సిపాలిటీని రాష్ట్రానికే రోల్ మోడల్గా మారుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో పార్టీలతో సంబంధం లేకుండా, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ’ఇందిరమ్మ ఇల్లు’ అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రథమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. తనపై వలస వచ్చిన కొందరు వ్యక్తులు పనిగట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు.

ఆమనగల్లుతో తనకు ఉన్న పేగు బంధం విడదీయలేనిదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరుస్తామని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధికి అండగా నిలిచే కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్లు  తాళ్ల రవి, పసుపుల శ్రీశైలం, నాయకులు గుర్రం కేశవులు, చెన్నారెడ్డి, జగన్, మాన య్య, అప్పం శీను, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ నాయక్,బాబా, అలీమ్, ధోని, శ్రీకాంత్, మల్లేష్,మహేష్, విజయ్‌లు పాల్గొన్నారు.