20-01-2026 12:27:20 AM
ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
చిన్న చింతకుంట జనవరి 19 : జిమ్ ప్రతి రోజు చేయడం ద్వారా ఎంతో సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో క్యూఎఫ్ ఫీట్నెస్ వరల్ జిమ్ ను సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబెర్స్ లు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, నాయకులు తో కలిసి ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ జిమ్లో క్రమంగా వ్యాయామం చేయడం వల్ల వ్యా యామం సమయంలో ఎండార్ఫిన్స్ వంటి హార్మోన్లు విడుదలై ఒత్తిడి, ఆందోళన తగ్గి, మనోస్థైర్యం, మెరుగవుతుందన్నారు.
క్రమం తప్పకుండా జిమ్కి వెళ్లేవాళ్లలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారని తెలిపారు అనంతరం అల్లిపూర్ గ్రామానికి చెందిన పలువురు బిఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే జియంఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు వార్ నెంబర్స్ సర్పంచులు, ఉపసర్పంచ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.