calender_icon.png 21 February, 2026 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదరిస్తే మరింత అభివృద్ధి

21-02-2026 01:12:22 AM

మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

మానకొండూరు, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): జనహితమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తే ప్రజలు మరింత పురోభివృద్ధి సాధిస్తారని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఎల్‌ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో శుక్రవారం తిమ్మాపూ ర్ మండలానికి చెందిన 57 మందికి సీఎంఆర్‌ఎఫ్, 67 మందికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం,అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలన్నారు.   

ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 23వ విడుతలో తిమ్మాపూర్ మండలానికి చెందిన 57 మంది లబ్ధిదారులకు 15,78,500 రూపాయలు మంజూరు కాగా, వాటిని చెక్కుల రూపంలో అందిస్తున్నట్టు తెలిపారు.అలాగే 67 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద 67,08,772 రూపాయ ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, మాజీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, మాజీ కార్పొరేటర్ సల్ల రవీందర్ పాల్గొన్నారు.

నర్సింగపూర్‌లో...

తిమ్మాపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న మహిళా స్వశక్తి సంఘ భవనానికి శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ భూమిపూజ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెర్క రవీందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు,గుంటి మల్లేశం పాల్గొన్నారు.

కొత్తపల్లిలో...

గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామ సర్పంచ్ కాల్వ పద్మ-కొమురయ్య కుమార్తె వివాహానికి మానకొండూర్ ఎమ్మెల్యే  డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని సాయిరాం గార్డెన్స్ లో జరిగిన ఈ వివాహానికి ఎమ్మెల్యే హాజరై నూతన వధూవరులను అక్షితలు వేసి ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట గన్నేరువరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, తిమ్మాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు బండారి రమేశ్, మాజీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, పార్టీ నాయకులు మామిడి అనిల్ కుమార్, తమ్మనవేణి రాములు యాదవ్ తదితరులు హాజరయ్యారు.