calender_icon.png 21 February, 2026 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ గవర్నెన్స్‌లో.. రోల్ మోడల్‌గా తెలంగాణ

21-02-2026 01:11:30 AM

  1. ‘తెలంగాణ రైజింగ్’లో ట్రాన్స్‌ఫార్మేషన్ టూల్‌గా టెక్నాలజీ

కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ సామాన్యుడికి చేరువ చేయాలన్నదే మా తపన 

‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) : ఏఐ, క్వాంటం కంప్యూ టింగ్, బ్లాక్ చెయిన్ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌ను సామాన్యుడికి చేరు వ చేసి డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తీర్చి దిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్య సాధనలో టెక్నాలజీని కేవలం ఓ సాఫ్ట్‌వేర్‌గా మాత్రమే కాకుండా ఓ ట్రాన్స్‌ఫార్మేషన్ టూల్‌గా మార్చుకుంటున్నామని తెలిపారు. 

ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తో న్న ప్రణాళికలను న్యూఢిల్లీ భారత్ మండపంలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో భాగంగా శుక్రవా రం ‘ఏజెంట్స్ ఆఫ్ ఛేంజ్, ఏఐ ఫర్ గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ క్లైమేట్ రెసిలియెన్స్’ అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. పౌర సేవలకు టెక్నాలజీని అనుసంధానం చేసి ప్రభుత్వానికి, పౌరులకు మధ్య ఉండే దూరాన్ని తగ్గించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు.

భారత్ ఫ్యూచ ర్ సిటీ, ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, ఐకం, ఏఐ ఆధారిత తెలంగాణ డిజిటల్ ఎక్స్ఛేంజ్, భూ భారతి లాంటి విప్లవాత్మక సంస్కరణ లు డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణ బ్రాం డ్‌ను సుస్థిరం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతిక ఫలాలను కేవలం ఓ ప్రాంతానికో లేదా వర్గానికో పరిమితం చే యకుండా అందరికీ చేరువ చేసేలా ‘ఏజెంటిక్ ఏఐ’ వినియోగంపై దృష్టి సారించామ న్నారు.

టెక్నాలజీని గవర్నెన్స్‌కు  పరిమితం చేయకుండా వ్యవసాయం, వాతావరణ మార్పులు, ఆరో గ్యం, సుస్థిర నగరాల అభివృద్ధి, క్లీన్ ఎనర్జీ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ రంగాలకూ విస్తరించేం దుకు చర్యలు తీసుకుంటు న్నామని వివరించారు.