18 July, 2026 | 4:24 PM

Breaking News

భూక్య రవి నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పాఠశాలలో మొక్కలు నాటిన కలెక్టర్   •   100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   గడ్డన్న సుద్ద వాగు ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్   •   ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపరచాలి   •   జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో సర్వజ్ఞ స్కూల్ విద్యార్థికి కాంస్య పతకం   •   ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ ఆటోనామౌస్ కళాశాలలో యువ నాయకత్వం   •   విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి   •   డీటిబ్ల్యూఓ జాదవ్ అంబాజీకి సన్మానం   •   సోనం వాంగ్చుక్ దీక్షకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు   •  

భూక్య రవి నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

18-07-2026 04:24 PM

ఇల్లందు,(విజయక్రాంతి): ఇటీవల మరణించిన ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది భుక్యా రవి నాయక్ కుటుంబ సభ్యులను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. రవి నాయక్ మృతికి ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఎలాంటి అవసరం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రవి నాయక్ సమాజానికి, న్యాయవాద వృత్తికి అందించిన సేవలను ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, ఇల్లందు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మండల రాంమహేష్, నాయకులు పూనెం సురేందర్, తాటి భిక్షం తదితరులు పాల్గొన్నారు.