గడ్డన్న సుద్ద వాగు ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్
18-07-2026 04:18 PM
భైంసా,(విజయక్రాంతి): భైంసా పట్టణంలోని గడ్డన్న శుద్ధ వాగు ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా శనివారం సందర్శించారు. ప్రాజెక్టును పరిశీలించిన ఆయన ప్రాజెక్టులో నీటి సామర్థ్యం ఆయకట్టు వివరాలు ప్రాజెక్ట్ స్థితిగతులు అంశాలను నేటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు మరమ్మతుల ప్రతిపాదనలను వెంటనే తయారు చేయాలని సూచించారు. తాగునీటికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్, నీటిపారుదల శాఖ అధికారులు అనిల్ ఆర్డిఓ రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.






