18 July, 2026 | 3:59 PM

సోనం వాంగ్చుక్ దీక్షకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు

18-07-2026 03:59 PM

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్షకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా శాఖ మద్దతు ప్రకటించింది. శనివారం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ సంస్థను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త విద్యా సంఘాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్చుక్ గత ఇరవై రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారని తెలిపారు.

ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఈ నెల ఇరవై తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో “చలో సభ” పిలుపుకు పార్టీ రాష్ట్ర అధినేత తీన్మార్ మల్లన్న మద్దతు ప్రకటించారని తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన ర్యాలీ ద్వారా సోనం వాంగ్చుక్ డిమాండ్లకు పూర్తి మద్దతు ప్రకటించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.