22 August, 2026 | 2:54 PM

Breaking News

ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణంపై అవగాహన కార్యక్రమం   •   ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   జగన్నాథ ఆలయంలో హైకోర్టు జడ్జి ప్రత్యేక పూజలు   •   అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జి   •   డాక్యతాండలో ఘనంగా సామూహిక కుంకుమార్చనలు   •   ప్రజలను ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం సరికాదు   •   జీవో నెంబర్ 97ను రద్దు చేయాలంటూ నిరసన దీక్ష   •   వెంకటరామిరెడ్డి విగ్రహం నెలకొల్పాలని ఏకగ్రీవ తీర్మానం   •   మైలారం యంగ్ ఇండియా పాఠశాల పనులు వేగవంతం చేయాలి   •  

దీక్ష దివాస్‌ను జయప్రదం చేయాలి: ఎమ్మెల్యే కోవ లక్ష్మి

28-11-2024 01:17 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,( విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమై కెసిఆర్ నిరాహార దీక్ష చేపట్టిన నవంబర్ 29న నిర్వహించే దీక్ష దివాస్ ను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బి.ఆర్.ఎస్ భవనం లో నిర్వహించనున్న దీక్ష దివాస్ కార్యక్రమ పనులను పర్యవేక్షించారు. రెండు వేల మందితో చేపట్టే ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు తెలంగాణ వాదులు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. దీక్ష దివాస్ కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు భోజన వసతి ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ ఆలీబిన్ అహ్మద్, నాయకులు మార్సుకోల సరస్వతి, గంధం  శ్రీనివాస్, హైమద్, నిసార్, కిష్టయ్య, భీమేష్ ,శ్రీనివాస్ ,బలరాం ,సాజిద్ తదితరులున్నారు.