22 August, 2026 | 3:30 PM

జగన్నాథ ఆలయంలో హైకోర్టు జడ్జి ప్రత్యేక పూజలు

22-08-2026 02:48 PM

చెన్నూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ జగన్నాథ ఆలయంలో హైకోర్టు జడ్జి నగేష్ బీమపాక ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు దామెర మోనాచార్యులు, అనిల్ చార్యులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. హైకోర్టు జడ్జి నగేష్ బీమాతో పాటు మంచిర్యాల జిల్లా జడ్జి ఏ. వీరయ్య, చెన్నూర్ మెజిస్ట్రేట్ పర్వతపు రవి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. హైకోర్టు జడ్జి రాక సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు సీఐ బన్సీలాల్, కోటపల్లి సీఐ కృష్ణ, జైపూర్ సీఐ నవీన్, ఎస్సై శ్యామ్ పటేల్, రాజేందర్, పోలీసు సిబ్బంది, దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.