3 April, 2026 | 3:15 PM

మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు

03-04-2026 01:50 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రెబ్బెన మండలం ఇందిరా నగర్‌లోని స్వయంభూ శ్రీ కనకదుర్గా దేవి – శ్రీ మహంకాళి దేవస్థానంలో  జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో  ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొన్నారు.ఈ సందర్భంగా  ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ అధ్యక్షుడు తిరుపతి, అర్చకుడు దేవర వినోద్ ,సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరు శాంతి, సౌభాగ్యంతో ఉండాలని ప్రార్థించారు.జాతర సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ,భక్తులు పాల్గొన్నారు.