3 April, 2026 | 3:15 PM

ఘనంగా దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు

03-04-2026 01:49 PM

 నివాళులర్పించిన మేయర్,డిప్యూటీ మేయర్ మరియు కార్పొరేటర్లు

మకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ లోని విద్యానగర్ బీరప్ప కమాన్ వద్ద దొడ్డి కొమురయ్య(Doddi Komaraiah Jayanthi Celebrations) 99వ జయంతి వేడుకలను బీరప్ప కుర్మ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ , డిప్యూటీ మేయర్, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులర్పించారు.

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య ఆశయాలను స్మరించుకున్నారు.  అనంతరం దొడ్డి కొమురయ్య  జయంతి పురస్కరించుకొని మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్రె అనిల్ - పద్మ 48వ డివిజన్ కార్పొరేటర్,ఎన్నం ప్రకాష్ - లక్ష్మి 49వ డివిజన్ కార్పొరేటర్,గాజ శివరాం - రమ 47వ డివిజన్ కార్పొరేటర్,21వ డివిజన్ కార్పొరేటర్ వి. నరసింగం మరియు మాజీ కార్పొరేటర్లు, కురుమ సంఘం సభ్యులు, కుల పెద్దలు మరియు యువజన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.