మహంకాళి జాతర వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సోమవారం మహంకాళీ జాతర గోడ పత్రికలను ఆవిష్కరించారు. రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ దేవస్థానంలో ఏప్రిల్ 2, 3 తేదీలలో నిర్వహించనున్న మహంకాళీ జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆమె తన నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు జాతర ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యేకు వివరించారు. జాతరను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా నిర్వహించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, ఆలయ అధ్యక్షుడు మోడెం తిరుపతి గౌడ్, ఆలయ ప్రధాన అర్చకుడు దేవార వినోద్ స్వామి, దుర్గం తిరుపతి, మిట్ట వెంకటేష్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




