10 March, 2026 | 11:56 AM

విజయ క్రాంతి కథనానికి స్పందించిన అధికారులు

09-03-2026 03:40 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రాంగణంలో చేతిపంపు చెడిపోయింది పట్టించుకోండి సారు అనే కథనం విజయ క్రాంతిలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. గ్రామ సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి, కార్యదర్శి వైకుంఠం స్పందించారు. గ్రామ ఫస్ట్ వార్డ్ సభ్యులు సామల తిరుపతి దగ్గరుండి చేతిపంపుకు మరమ్మత్తులు చేయించారు. స్పందించి చేతిపంపుకు మరమ్మత్తులు చేయించినందుకు విద్యార్థులు ఉపాధ్యాయులు అధికారులకు విజయ క్రాంతి దినపత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.