17 April, 2026 | 11:54 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం

11-12-2025 08:14 PM

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు 

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం పరిధిలోని బైరంపల్లి, సిద్ధాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు కల్లెబోయిన కుమారస్వామి, మంద రాజు, వార్డు మెంబర్ల గెలుపు కోసం నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజును గ్రామాలలోని మహిళామణులు సాంప్రదాయ కోలాటలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినాక పేద ప్రజలు కడుపునిండా తినాలనే సంకల్పంతో సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో అర్హులైన పేదలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు. మహిళాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఇందిరమ్మ చీరలు అందిస్తుందని తెలిపారు. సిద్దాపూర్ గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని, గ్రామ సర్పంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంద రాజును భారీ మెజార్టీతో గెలిపించాలని, రాజు నాకు చిన్న కొడుకు లాంటివాడని కష్టపడే మనస్తత్వం ఉన్నవాడని, పేదింటి బిడ్డ అని మంచి చేసే వ్యక్తి అని ప్రజలందరూ గమనించాలని రాజు కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పాటైనాక మహిళలను కోటీశ్వరురాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మహిళలకు పెట్రోల్ బంకు, సోలార్ పవర్ బస్సులు, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని అలాగే ఇప్పటివరకు గ్రామంలో 24 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని, ఇందిరమ్మ ఇండ్లు నిరంతర ప్రక్రియని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లాకి కిసాన్ అధ్యక్షులు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, ఆత్మకూరు ఏఎంసి వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి తిరుపతి, అసంపర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్రెడ్డి, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.