11-12-2025 08:07:09 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ వాసవి క్లబ్ అధ్యక్షుడిగా మర్యాల ఉదయ్ బాబు ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ఆ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు ఏకిరాల శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు పాత శ్రీనివాస్ తెలిపారు. గురువారం సాయంత్రం పట్టణంలోని వాసవి మాత మందిరంలో జరిగిన సమావేశంలో వాసవి క్లబ్ 2026 సంవత్సరంనకు నూతన అధ్యక్ష కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. క్లబ్ కార్యదర్శిగా బాల శ్రీనివాస్, కోశాధికారిగా కలకుంట్ల శ్రీధర్లను ఎంపిక చేసిన్నట్లు వెల్లడించారు.