4 June, 2026 | 3:15 AM

కాల్వ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

04-06-2026 02:17 AM

మహబూబాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా నెల్లికుదు రు మండలం కాచికల్ గ్రామంలో కట్టు కా లువ మరమ్మతు పనులను స్వయంగా ఎ మ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ జేసిబీ నడిపి ప్రారంభించారు. కట్టు కాలువ శిథిలమై సాగునీటికి ఇబ్బంది కలువుతోందని రైతులు తన దృష్టికి తీసుకురాగా 49 లక్షల 65 వేల రూపాయలు మంజూరు చేయించి పనులు ప్రారంభించి వచ్చే వానకా లం ఎక్కువగా పనులు పూర్తి చేసి రైతులకు సాగునీటి కష్టాలు తీర్చనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 

అలాగే రామన్నగూడెంలో మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరై నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారుల ఇండ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేయించి అభినందించారు. అలాగే హెల్త్ సెంటర్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. నూతనంగా నిర్మించనున్న మహిళ సమాఖ్య భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకొని ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.